Samantha : ఫ్యాన్స్ మీటింగ్ పెట్టిన సమంత.. అభిమానులతో పాటు ఎమోషనల్ అయిన సమంత.. ఫోటోలు వైరల్..

తాజాగా సమంత ఫ్యాన్స్ మీట్ పెట్టింది.

Samantha Meets her Fans and got Emotional Photos goes Viral

Samantha : నటి సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో, బయట ఈవెంట్స్ తో బిజీగానే ఉంది. రెగ్యులర్ గా ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొంటూ, ఫోటోషూట్స్ షేర్ చేస్తూ హంగామా చేస్తూనే ఉంది. తాజాగా సమంత ఫ్యాన్స్ మీట్ పెట్టింది.

పలువురు అభిమానులతో సమంత ఫ్యాన్స్ మీటింగ్ పెట్టింది. సమంత వెళ్లి అభిమానులను కలుసుకుంది. వచ్చిన అభిమానులందరితో ఫోటోలు దిగింది. అభిమానులు ప్రేమతో తెచ్చిన మంచి మంచి గిఫ్ట్స్ తీసుకుంది. ఓ మహిళా అభిమాని ఏడుస్తూ సమంతని హగ్ చేసుకోగా సామ్ ఆమెని ఓదార్చింది. అనంతరం సమంతతో కేక్ కట్ చేయించారు అభిమానులు. అభిమానుల ప్రేమని చూసి సమంత కూడా ఎమోషనల్ అయింది.

Also Read : Penchal Das : అమ్మాయిలపై దారుణాల గురించి.. పెంచల్ దాస్ పాడిన ‘నా నల్లా కలువా పువ్వా..’ సాంగ్ విన్నారా?

సమంత ఫ్యాన్ మీట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతని కలిసిన అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెతో దిగిన ఫోటోలు షేర్ చేస్తున్నారు.