×
Ad

Salman-Samantha: సల్మాన్ ఖాన్ సరసన సమంత.. భర్త రాజ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్

సల్మాన్ ఖాన్(Salman-Samantha) తో భారీ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకద్వయం రాజ్ అండ్ డీకే.

samantha playing lead role in salman khan raj and dk movie

  • సల్మాన్ ఖాన్ హీరోగా రాజ్ అండ్ డీకే క్రేజీ మూవీ
  • పాన్ ఇండియా లెవల్లో భారీగా
  • హీరోయిన్ గా ఫిక్స్ అయిన సమంత

Salman-Samantha: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కాంబో మరేదో కాదు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా, స్టార్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకనట రానుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా సౌత్ స్టార్ బ్యూటీ సమంతను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో సమంత(Salman-Samantha) పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వారితోనే ‘సిటాడెల్: హనీ బన్నీ’లో కూడా చేసింది. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. సల్మాన్ మాస్ ఇమేజ్‌కు, సమంత యాక్టింగ్ పవర్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రాజ్ అండ్ డీకే సిద్ధం చేశారట. ఇక పెళ్లి తరువాత రాజ్- సమంత కలిసి చేస్తున్న సినిమా కావడం విశేషం.

RC17 :RC17 స్టోరీపై క్రేజీ అప్‌డేట్.. సుకుమార్ అసిస్టెంట్ హుస్సేన్ షా కిరణ్ సెన్సేషనల్ కామెంట్స్

మామూలుగా సల్మాన్ ఖాన్ పక్కా కమర్షియల్ చేస్తూ ఉంటాడు. కానీ రాజ్ అండ్ డీకే స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రెండు స్టైల్స్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పాన్-ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగనుందని టాక్. సినిమాలో సమంత కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన రోల్‌లో కనిపించనున్నారట.

చాలా కాలం తరువాత సమంతకు అలాంటి పాత్ర దక్కడం అది కూడా సల్మాన్ ఖాన్ సినిమాలో అంటే మాములు విషయం కాదు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్ కంప్లీట్ అవగానే రాజ్ అండ్ డీకే సినిమా సెట్స్ కి రానున్నాడు సల్మాన్ ఖాన్. ఇంకా ఈ సినిమాకు సంబందించిన మిగత వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.