Samantha : ‘బంగార్రాజు’ను వదిలేసి.. పుష్ప ట్రైలర్‌పై సమంత ట్వీట్.. ఎందుకంటే..!?
సమంత పుష్ప సినిమా ట్రైలర్ నే ఎందుకు రీట్వీట్ చేసిందనేది ఆసక్తికరమైన అంశం.
- Paramesh V
- Published On : December 7, 2021 / 07:34 AM IST
Samantha
Samantha – Pushpa: హీరోయిన్ సమంత వార్తల్లోనే ఉంటోంది. ఆమె ట్వీట్ చేసినా.. ఇన్ స్టా పోస్ట్ పెట్టినా.. అన్నీ వైరల్ అవుతున్నాయి. తాజాగా…. పుష్ప సినిమా ట్రైలర్ పై సమంత పెట్టిన పోస్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
Read Also : Samantha: చైతూతో డైవర్స్‌పై తొలిసారి స్పందించిన సామ్!
పుష్పరాజ్… తగ్గేదే లే.. అంటూ అల్లు అర్జున్ ట్రైలర్ రిలీజ్ ట్వీట్ ను రీ-ట్వీట్ చేసింది సమంత. పుష్ప -దరైజ్ 01… డిసెంబర్ 17న థియేటర్లలోకి వస్తోందంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టింది. ఐతే సమంత ట్వీట్ ను సమంత ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోగా.. అక్కినేని- సమంత ఉమ్మడి అభిమానులు మాత్రం డిఫరెంట్ గా రియాక్టవుతున్నారు.
Read Also : Samantha: సామ్ బాలీవుడ్ ప్లాన్స్.. ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం!
బంగార్రాజు సినిమాలో నాగచైతన్య-కృతి శెట్టిపై తీసిన ‘నాకోసం’ పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. సిరివెన్నెల ఈ పాటను రాశారు. ఐతే… ఈ పాటపై సమంత ఎందుకు రియాక్ట్ కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. సమంత… మరి దీని సంగతేంటి అంటూ… ఫొటోలు పెట్టి అడుగుతున్నారు.
Naga Chaithanya Nagarjuna Bangarraju
సమంత పుష్ప సినిమా ట్రైలర్ నే ఎందుకు రీట్వీట్ చేసిందనేది మరో ఆసక్తికరమైన అంశం. తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ .. ఓ ఐటమ్ సాంగ్ ను ‘పుష్ప’ కోసం చేసింది సమంత. దీనికి సంబంధించిన లుక్ లో సమంత Sizzling గా కనిపిస్తోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత… సమంత వెండితెరపై కనిపించబోతున్న తొలి సినిమా, సాంగ్ ‘పుష్ప’లోనిదే. తాజాగా మరిన్ని ప్రాజెక్టులు కూడా సమంత ఒప్పుకుంది. ఫ్యాన్స్ ఈ పాట టీజర్ కోసం ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పాటలు రిలీజ్ చేసిన సినిమా యూనిట్… అతి త్వరలోనే సమంత ఐటమ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతోంది. పుష్పతో సమంత కాంబినేషన్ కు సంబంధించి ఇంత హైప్ ఉంది కాబట్టే… తను రీట్వీట్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Pushpa Raj ???
Thaggedhe le ??#PushpaTheRise #PushpaTheRiseOnDec17 https://t.co/TmfmY8NCph— Samantha (@Samanthaprabhu2) December 7, 2021
Let’s rock this ? https://t.co/4Zkq1YA9U1
— Samantha (@Samanthaprabhu2) November 30, 2021
