samyuktha menon: ఆయన ఒకే చేశారంటే అది బెస్ట్.. కెమెరా ముందు విశ్వరూపం.. అందుకే మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంది

తమిళ స్టార్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon).

samyuktha menon interesting comments on hero dhanush

  • వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సంయుక్త
  • హీరో ధనుష్‌పై ప్రశంసల జల్లు
  • మరోసారి ఆయనతో నటించాలని ఉందంటూ కామెంట్స్

samyuktha menon: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్తా మీనన్. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే బాలకృష్ణతో అఖండ 2లో చేసిన విషయం తెలిసిందే. అలాగే స్వయంభు లాంటి పీరియాడికల్ సినిమాలు కూడా చేస్తోంది.

Sravanthi chokkarapu: హనుమాన్ జయంతి పూజలో స్రవంతి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన యాంకర్

అయితే, తాజాగా తన కెరీర్, కో-ఆర్టిస్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సంయుక్త(samyuktha menon). ముఖ్యంగా ‘సార్’ చిత్రంలో కలిసి నటించిన కోలీవుడ్ స్టార్ ధనుష్‌పై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. ధనుష్ ఒక అసాధారణమైన నటుడని, ఆయన పనితీరు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సంయుక్త పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారని, కేవలం కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే తనలోని పూర్తి శక్తిని ప్రదర్శిస్తారని ఆమె వివరించారు.

ధనుష్ ఒక స్క్రిప్ట్‌ను ఓకే చేశారంటే, అందులో ఖచ్చితంగా విషయం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారని, అది ఆయనకున్న గొప్పతనమని కొనియాడారు. భవిష్యత్తులో తనకు మళ్లీ ధనుష్‌తో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, తాను మళ్లీ కలిసి పనిచేయాలనుకునే నటుల జాబితాలో ఆయన అగ్రస్థానంలో ఉంటారని సంయుక్త మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో సంయుక్త చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె ‘స్లమ్ డాగ్’, ‘బెంజ్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.