Nani : సందీప్ వంగా మొదటి సినిమా నానితో చేయాల్సింది.. కానీ ఏమైందంటే..!

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా ఒక ఇంటరెస్టింగ్ విషయం తెలియజేశారు. వంగా మొదటి మూవీ నానితో చేయల్సిందట. మరి ఏమైంది..?

Sandeep Reddy Vanga first movie was to be Nani but what happened

Nani : నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. దీంతో నాని అండ్ సందీప్ వంగా కలిసి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సందీప్ వంగా ఒక ఇంటరెస్టింగ్ విషయం తెలియజేశారు. వంగా మొదటి మూవీ నానితో చేయల్సిందట. మరి ఏమైంది..?

అమెరికా ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన తరువాత సందీప్ వంగా 2010 టైములో నాని ‘రైడ్’ సినిమా చూశారట. ఆ సినిమలో బైక్ మీద తన ప్యాషన్ తెలియజేస్తూ నాని చెప్పిన ఒక డైలాగ్ సన్నివేశం సందీప్ వంగాకి బాగా నచ్చేసిందట. దీంతో తన దగ్గర ఉన్న ఒక లవ్ స్టోరీని నానితో కలిసి చేయాలని భావించారట. ఈక్రమంలోనే ఒక నిర్మాతను కలిసి కథ వినిపించగా, అతనికి స్టోరీ బాగా నచ్చింది. హీరో ఎవరు అనుకుంటున్నావు అని సందీప్ ని ప్రశ్నించగా.. అతను నాని పేరు చెప్పారట.

Also read : Animal Twitter Review : ‘యానిమల్’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

అయితే నిర్మాత నాని కాదని, మరో ముగ్గురు హీరోల పేర్లు చెప్పాడట. అయితే సందీప్.. ఆ సినిమాని నానితో తియ్యాలని ఫిక్స్ అవ్వడంతో ఆ నిర్మాతకు సారీ చెప్పి వచ్చేశారట. ఇక ఈ విషయాన్ని నానికి ఇప్పుడు తెలియజేయడంతో.. నాని ఇప్పుడు కథ తీసుకు రమ్మని కోరారు. సందీప్ వంగాతో సినిమా మిస్ అయిన విషయం తెలుసుకున్న నాని అభిమానులు కూడా ఎంతో ఫీల్ అవుతున్నారు. భవిషత్తులో వీరిద్దరి కలయికలో ఒక సినిమా సెట్ అయితే బాగుండు అని తమ ఆశని తెలియజేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు