Romanchakam Glimpse: సందీప్ రెడ్డి వంగ ‘రోమాంచకం’.. యూత్ ఫుల్ కంటెంట్ తో గ్లింప్స్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నేడు సరికొత్త(Romanchakam Glimpse) చిత్రాన్ని ప్రకటించారు.

sandeep reddy vanga Romanchakam Glimpse released

Romanchakam Glimpse: దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నేడు సరికొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు ‘రోమాంచకం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్న సందీప్ వంగ, ఈసారి యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం విశేషం. ఈ సందర్బంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Sai Krishna Case: సాయికృష్ణ కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ పార్టీ.. రూ. 20 లక్షల ఆర్థిక సాయం

ఈ చిత్రంలో ‘మేము ఫేమస్’, ‘గోదారి గట్టు పైన’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అతనికి జోడీగా ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.

కొత్త దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో వస్తున్న సినిమా కావడంతో, ‘రోమాంచకం(Romanchakam Glimpse)’ టైటిల్‌కు తగ్గట్టుగానే సరికొత్త కథనంతో, వినూత్నమైన ఎమోషన్స్‌తో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది.