Prabhas : ప్రభాస్ సినిమాలో సరికొత్త విలన్‌గా సంజయ్‌ ద‌త్.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న డైరెక్టర్ మారుతి..

డైరెక్టర్ మారుతి సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరిగింది. షూట్ లొకేషన్ నుంచి రెండు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

Sanjay Dutt will Play Key Role in Prabhas Maruthi Film Talk goes Viral

Prabhas : ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ఇంకా పడకపోయినా భారీ సినిమాలని లైన్లో పెడుతున్నాడు ప్రభాస్. సాహోతో పర్వాలేదనిపించినా రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో అభిమానులని, ప్రేక్షకులని నిరాశపరిచాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు అందరి ఆశలు సలార్(Salaar) పార్ట్ 1 మీదే ఉన్నాయి. సలార్ తర్వాత కల్కి 2898AD, డైరెక్టర్ మారుతి సినిమా, స్పిరిట్ సినిమా.. ఇలా చాలానే లైన్లో పెట్టాడు.

ప్రస్తుతం కల్కి, మారుతి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్. కల్కి సినిమా షూట్ ఇప్పుడు జరుగుతుందని సమాచారం. అయితే డైరెక్టర్ మారుతి సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరిగింది. షూట్ లొకేషన్ నుంచి రెండు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. మారుతి – ప్రభాస్ సినిమాలో మాళవిక మోహనన్, రిధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్‌గా సంజయ్ దత్(Sanjay Dutt) ని తీసుకోబోతున్నట్టు సమాచారం. డైరెక్టర్ మారుతి, SKN ఇటీవల ముంబై వెళ్లి సంజయ్ దత్ కి లుక్ టెస్ట్ చేశారని, మారుతికి కావలసినట్టు సంజయ్ ని తీర్చిదిద్దారని, సంజయ్ సరికొత్త లుక్ కూడా మారుతికి నచ్చినట్టు సమాచారం. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా ఓ సరికొత్త పాత్రలో సంజయ్ దత్ ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో విజయ్ రష్మిక రిలేషన్ గురించి..

సలార్ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూట్ మళ్ళీ మొదలుపెట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అన్ని ఇలా లీక్ అయినవే. దీంతో ఈ సమాచారం కూడా నిజమే అవ్వొచ్చు, ప్రభాస్ కి విలన్ గా సంజయ్ దత్ అంటే పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు. ఇక సంజయ్ దత్ ఇటీవల వరుసగా సౌత్ సినిమాల్లో కనిపించి మెప్పిస్తున్నారు. ఆల్రెడీ KGF, లియో సినిమాల్లో అదరగొట్టగా ఇస్మార్ట్ శంకర్ 2లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా నటించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు