Sankranthi 2027 : టాలీవుడ్‌లో అప్పుడే మొద‌లైన‌ సంక్రాంతి రేస్‌.. ఏకంగా 6 సినిమాలు.. ఇంకెన్ని వ‌స్తాయో?

టాలీవుడ్‌లో సంక్రాంతికి (Sankranthi 2027) విడుద‌ల చేసేందుకు సినిమాలు పోటీ ప‌డుతున్నాయి.

Sankranthi 2027 race begins in Tollywood already 6 movies announced release dates

Sankranthi 2027 : టాలీవుడ్‌లో సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సారి కూడా పెద్ద హీరోల మూవీస్‌తో పాటు ఇద్దరు యంగ్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. దీంతో 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలపై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది. మహాకాళి సినిమా జనవరి 8న, వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ నటిస్తున్న జనవరి 12న విడుదల సినిమా జనవరి 12న విడుదలకు రెడీ అవుతోంది.

సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు జనవరి 12న, చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న కాకా మూవీ జనవరి 13న, రవితేజ, శ్రీ విష్ణు సినిమా జనవరి 14న, శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న జార్జ్ క్రిష్ సినిమా జనవరి 14న రిలీజ్‌ చేస్తామని డేట్స్ ప్రకటించారు. అంటే ఏకంగా ఆరు సినిమాలు సంక్రాంతి సీజన్‌లో రేసులో ఉన్నట్టే.

Manisha Eerabathini : సింగ‌ర్ సోయ‌గం.. మనీషా ఈరబతిని క్యూట్ ఫోటోలు..

అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి బరిలోకి దిగడం సాధ్యమేనా.? అన్నదే అసలు ప్రశ్న. అందుబాటులో ఉన్న సింగిల్ స్క్రీన్‌ థియేటర్లు ఎన్ని.? మల్టీఫ్లెక్సుల్లో ఉన్న స్క్రీన్లు ఎన్ని.? సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు దక్కే థియేటర్ల సంఖ్య ఎంత.? ఈ లెక్కలు చూసుకోకుండా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారా.? సంక్రాంతి బరిలో నిలిస్తేనే సక్సెస్ కొడతామన్న హోప్సా అన్నది డిస్కషన్ పాయింట్‌గా మారింది.

Anshu reddy : ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ న‌టి అన్షురెడ్డి వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు..

సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కూడా రాబోతున్నాయి. చిరంజీవి, రవితేజ, వెంకటేష్ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరు సినిమాలు ఒకే సారి రిలీజ్ అయితే మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర క్లాష్ అవడం ఖాయం. దీంతో పెద్ద సినిమాలన్నీ మూడ్రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తే కలెక్షన్స్ వచ్చేదెట్లా.? అన్న టాక్‌ కూడా మొదలైంది. దీంతో చివరి నిమిషంలో కొన్ని సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని..తమ సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇప్పటికే సంబరాల ఏటిగట్టు సినిమా తేదీ మార్పుపై చర్చ జరుగుతోంది. ఆరు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయని అనిపిస్తున్నా..2027 సంక్రాంతికి ఎన్ని సినిమాలు థియేటర్లలో ఉంటాయో, ఎవరు తప్పుకుంటారో వేచి చూడాలి మరి.