Santosh Sobhan : 100 షార్ట్ ఫిలిమ్స్ తీసిన యూట్యూబర్స్‌తో.. సంతోష్ శోభన్ కొత్త సినిమా..

100 షార్ట్ ఫిలిమ్స్ తీసి, చాలామంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన యూట్యూబర్స్‌తో సంతోష్ శోభన్ కొత్త సినిమా.

Santosh Sobhan new movie with MR Productions Joruga Hushaaruga Shikaaru Podhama

Santosh Sobhan : టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాని థియేటర్స్ లోకి తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ హీరో నటిస్తున్న కొత్త మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ రీసెంట్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రిష్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. కాగా ఈ సినిమాని 100 షార్ట్ ఫిలిమ్స్ తీసిన యూట్యూబర్స్ తెరకెక్కించబోతున్నారు. Mr.Productions పేరుతో యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మీరు చూసే ఉంటారు.

Rahul Sipligunj : బిగ్‌బాస్ ‘రతిక’తో రిలేషన్ గురించి రాహుల్ సిప్లిగంజ్ పోస్టు..

మధురం, పోసిసివ్‌నెస్, పెళ్లి పుస్తకం, ప్రయాణం.. వంటి సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్ తీసిన ఈ మేకర్స్ ఇండస్ట్రీకి ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేశారు. రాజ్ తరుణ్, చాందిని చౌదరి, ప్రియాంక జవాల్కర్.. ఇలాంటి వారంతా వీరి ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారే. ఇప్పుడు ఈ మేకర్స్ సంతోష్ శోభన్ తో పెద్ద సినిమాని తెరకెక్కిస్తూ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి ‘జోరుగా హుషారుగా షికారు పోదమా’ (Joruga Hushaaruga Shikaaru Podhama) అనే క్యాచీ టైటిల్ ని పెట్టారు.

Akhil Akkineni : ఇంకా ఏజెంట్ గెటప్‌లోనే అఖిల్.. కారణం ఏంటంటున్న నెటిజెన్స్..

ఇక రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. సుభాష్ చంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫల్గుణి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నాగ వంశి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా సంతోష్ శోభన్ ఈ ఏడాది నాలుగు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాగా ఒక్కటి విజయం సాధించలేదు. మరి ఈ చిత్రం అయినా
సంతోష్ కి సక్సెస్ ఇస్తుందా..? లేదా..? చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు