Sara Ali Khan: రౌడీ హీరోపై మనసు పారేసుకున్న సైఫ్ కూతురు సారా!

సౌత్ టు నార్త్.. టోటల్ పాన్ ఇండియా లెవల్ లో సూపర్ ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఏ ఇండస్ట్రీకెళ్తే ఆ ఇండస్ట్రీలో వావ్.. అనిపించుకుంటున్న విజయ్ ని చూసి బాలీవుడ్..

Sara Ali Khan: సౌత్ టు నార్త్.. టోటల్ పాన్ ఇండియా లెవల్ లో సూపర్ ఫాలోయింగ్ ను సంపాదిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఏ ఇండస్ట్రీకెళ్తే ఆ ఇండస్ట్రీలో వావ్.. అనిపించుకుంటున్న విజయ్ ని చూసి బాలీవుడ్ భామలు మనసు పారేసుకుంటున్నారు. అంతేకాదు.. ఈ రౌడీ హీరో సూపర్ కూలే కాదు.. అంతకుమించి సూపర్ హాట్ అంటూ తెగ పొగిడేస్తోంది సారా అలీఖాన్. ఇంత స్టైల్ గా, ఇంత యాటిట్యూడ్ తో ఉంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే విజయ్ దేవరకొండని చూసిన బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇంప్రెస్ అయిపోతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు చాలా మంది విజయ్ నా ఫేవరెట్ అని ఓపెన్ గానే ఎక్స్ ప్రెస్ చేశారు. లేటెస్ట్ గా సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్.. విజయ్ మీద తనకున్న ఇష్టాన్ని మరోసారి ఓపెన్ గా చెప్పింది. సైఫ్ అలీఖాన్ కూతురు సారా, టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి అయిన విజయ్ దేవరకొండ మీద మనసు పారేసుకుంది. ఛాన్స్ దొరికితే.. విజయ్ దేవరకొండతో సినిమాకి సై అంటోంది. అంతేకాదు.. విజయ్ దేవరకొండతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నానంటోంది. విజయ్ దేవరకొండ కూలే కాదు.. అంతకుమించి సూపర్ హాట్ అంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడే కాదు.. సారా అలీఖాన్ అంతకుమందు కూడా విజయ్ మీద ఇష్టాన్ని ఓపెన్ గా నే చెప్పింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండతో కలసి మనీష్ మల్హోత్రా ఇచ్చిన పార్టీలో విజయ్, చార్మి, కియారా, అనన్యతో కలిసి సారా పార్టీకి అటెండ్ అయ్యింది. అప్పుడు కూడా ఇలాగే విజయ్ నా ఫేవరెట్.. ఇది నా ఫ్యాన్ మూమెంట్ అంటూ విజయ్ తో దిగిన సెల్ఫీని ముచ్చటపడిపోతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు