Sara Arjun: ధురంధర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. బాలీవుడ్ ఐకానిక్ బయోపిక్ లో సారా
సంజయ్ లీలా బన్సాలి నిర్మాణంలో మధుబాల బయోపిక్. ప్రధాన పాత్రలో నటిస్తున్న సారా అర్జున్(Sara Arjun).
- V Santhosh Kumar
- Published On : April 10, 2026 / 09:23 AM IST
Sara Arjun plays the role of Madhubala in the Madhubala biopic
- బాలీవుడ్ లో మరో బయోపిక్
- మధుబాల బయోపిక్ చేస్తున్న జస్మీత్ కె. రీన్
- ప్రధాన పాత్రలో సారా అర్జున్
Sara Arjun: బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ తన కెరీర్‌లో అద్భుతమైన వేగంతో దూసుకుపోతోంది. ‘ధురంధర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, తెలుగులో ‘యుఫోరియా’ చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యింది. ప్రస్తుతం ఆమెకు వరుసగా భారీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ వెండితెర దిగ్గజం మధుబాల బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం సారాకు దక్కినట్టుగా తెలుస్తోంది.
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మీత్ కె. రీన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ కోసం మొదట పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ, చివరకు సారా అర్జున్(Sara Arjun) అయితేనే మధుబాల పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. హిందీ సినిమా స్వర్ణయుగాన్ని కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ధురంధర్’లో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన సారా, ఇప్పుడు మధుబాల వంటి ఐకానిక్ పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
