Tholi Prema Katha : ‘తొలి ప్రేమ కథ’ టీజర్ రిలీజ్..

Tholi Prema Katha : సాత్విక్ వర్మ, అనీ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’.

Satvik Varma and Annie Tholi Prema Katha Teaser

Tholi Prema Katha : సాత్విక్ వర్మ, అనీ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’. సాయి లక్ష్మణ్ అల్లు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర‌ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ముఖ్య అతిథులుగా హీరో ఆకాష్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ఈ చిత్ర‌ టీజర్ చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చాలా జెన్యూన్‌గా, నేచురల్‌గా ఉంది. సాత్విక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. తను చాలా కష్టపడ్డాడు. నాకు ఈ టీజర్ చాలా నచ్చింది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా అద్భుతంగా అనిపించాయి. ధ్రువన్ అద్భుతమైన మెలోడీ ఇచ్చాడు. పర్ఫార్మెన్స్‌లో చాలా సహజంగా ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ధంతేరస్ ఫోటోలు..

ఆకాష్ పూరి మాట్లాడుతూ..‘తొలి ప్రేమ కథ’ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సాత్విక్, అన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్లతో కలిసి పని చేశాను. ఇద్దరూ కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మర్స్. టీజర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. శైలేష్ కి, హీరో ఆకాష్ పూరికి ధన్యవాదాలు. వాళ్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆకాష్ అన్న నా ఈవెంట్‌లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. దీనికి కారణం ధ్రువన్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్. అలాగే మా నిర్మాత, దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. అందరూ కూడా మా సినిమాని సపోర్ట్ చేసి ఘనవిజయం చేయాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి లక్ష్మణ్ అల్లూ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథ అనుకున్నప్పుడే సాత్విక్ అన్నీ యాక్టర్స్‌గా ఊహించుకున్నాను. అలాగే ఇందులో విజువల్స్, మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమాని షూట్ చేశాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మా సినిమాని మీరందరూ సక్సెస్ చేసి, థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.