Satyadev
Satyadev : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలయి హీరోగా ఫేమ్ తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇప్పుడు హీరోగా, విలన్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా సత్యదేవ్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రిసెప్షన్ కి హాజరయ్యాడు.
అయితే ఈ రిసెప్షన్ లో సత్యదేవ్ చేతికి షోల్డర్ బ్యాగ్ తో కనిపించాడు. దీంతో సత్యదేవ్ కి ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో చేతికి గాయం అయిందని, అందుకు చిన్న సర్జరీ జరిగిందని తెలుస్తుంది.
Also Read : Virosh Reception : విజయ్ – రష్మిక రిసెప్షన్.. సందడి చేసిన రాజకీయ నేతలు, ప్రముఖులు.. ఫొటోలు
ప్రస్తుతం సత్యదేవ్ కోలుకుంటున్నాడని, జాగ్రత్తగా ఉండేందుకే ఇలా షోల్డర్ బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ సత్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. త్వరలో సత్యదేవ్ రావు బహదూర్, ఫుల్ బాటిల్ అనే సినిమాలతో రాబోతున్నాడు.