Rao Bahadur : సత్యదేవ్ ‘రావు బహదూర్’.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్..

సత్యదేవ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. (Rao Bahadur)

  • Published on- July 2, 2026 / 10:21 AM IST

satyadev

Rao Bahadur : సత్యదేవ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా రావు బహదూర్. మహేష్ బాబు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని అంచనాలు బాగానే ఉన్నాయి. టాలీవుడ్ నుంచి అయితే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది.

అయితే ఈ సినిమాకు భారీగానే ఖర్చుపెట్టారు. సత్యదేవ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగానే ఖర్చుపెట్టారని సమాచారం. ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్, కాస్ట్యూమ్స్ కే ఎక్కువగా ఖర్చు అయిందట. అయితే ఈ సినిమాని ముందుగానే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ 7 కోట్లకు కొనుక్కుంది. వేరే నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా దాదాపు 5 కోట్లు వచ్చాయని సమాచారం.

Also Read : Isakapatnam Review : ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. తండ్రి కూతుళ్ళ యుద్ధం..

ఇక ఈ సినిమాని నైజాంలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంధ్రా, సీడెడ్‌లో ధీరజ్ సినిమాస్, కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో థింక్ స్టూడియో ఇండియా, ఓవర్సీస్‌లో అథర్వణ గ్లోబల్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు థియేటరికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. అంటే రావు బహదూర్ థియేటర్స్ లో హిట్ అవ్వాలంటే కనీసం 35 నుంచి 40 కోట్లు గ్రాస్ వసూలు చేయాలి. సత్యదేవ్ కెరీర్లో హైయెస్ట్ 15 కోట్లు కలెక్షన్ అంతే. మరి రావు బహదూర్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.