Polimera 3 : పొలిమేర 3 గ్లింప్స్ వచ్చేసింది.. నగ్నంగా సత్యం రాజేష్..

మీరు కూడా పొలిమేర 3 గ్లింప్స్ చూసేయండి.. (Polimera 3)

  • Published on- November 9, 2026 / 08:52 PM IST

Polimera 3

Polimera 3 : పొలిమేర పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చేతబడులు నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్స్ గా మొదటి రెండు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు మూడో పార్ట్ రాబోతుంది. ఈసారి యాక్షన్ కింగ్ అర్జున్ కూడా పొలిమేర 3 లో భాగమయ్యారు. గత రెండు సినిమాల్లో ఉన్న సత్యం రాజేష్, బాలాదిత్య, సాయి కామాక్షి భాస్కర్ల.. పలువురు ఈ పార్ట్ 3 లో కూడా ఉండనున్నారు.

పొలిమేర 3 సినిమాని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, భరత్ నారంగ్ నిర్మాణంలో అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా పొలిమేర 3 సినిమా నుంచి మొదటి గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో.. వెంకటేశ్వర స్వామిని, పద్మనాభస్వామిని, శివుడ్ని చూపించి సత్యం రాజేష్ నగ్నంగా పూజలు చేయడం, చివర్లో యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీతో చూపించారు.

Also Read : Ego Raja : ఈగో రాజా ఆది సాయి కుమార్ ‘రౌడీ రాకాసి పిల్ల..’ సాంగ్ విన్నారా?

దీంతో పొలిమేర పార్ట్ 3 పై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఈసారి చేతబడులతో పాటు డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మీరు కూడా పొలిమేర 3 గ్లింప్స్ చూసేయండి..