Sekhar Master: అలనాటి తారలతో ఆడిపాడుతున్న శేఖర్ మాస్టర్..
ఒకప్పుడు బుల్లితెర వరుకే పరిమితమైన 'సింగింగ్ అండ్ డాన్స్' షోలు.. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో కూడా అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయిన 'ఆహా' వేదికగా 'డాన్స్ ఐకాన్' షో ఒకటి ప్రసారమవుతుండగా.. ఈ షోకి నటి రమ్యకృష్ణ, డాన్స్ మాస్టర్ శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
- gum 95921
- Published On : September 22, 2022 / 08:19 PM IST
Sekhar Master Dances With Ramya Krishna in Dance Icon Show
Sekhar Master: ఒకప్పుడు బుల్లితెర వరుకే పరిమితమైన ‘సింగింగ్ అండ్ డాన్స్’ షోలు.. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో కూడా అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అయిన ‘ఆహా’ వేదికగా ‘డాన్స్ ఐకాన్’ షో ఒకటి ప్రసారమవుతుండగా.. ఈ షోకి నటి రమ్యకృష్ణ, డాన్స్ మాస్టర్ శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
Ramya Krishna: రమ్యకృష్ణ వయసు తగ్గుతుందా.. అంటూ అందాలను అదేపనిగా చూస్తోన్న అభిమానులు!
ఇక ఈ షోకి సంబంధించి తాజా ప్రోమో విడుదల కాగా.. ఆ ప్రోమోలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ లు సామజవరాగమనా పాటకు కలిసి స్టెప్ లు వేశారు. గతంలో ఒక డాన్స్ షోలో ఇలానే శేఖర్ మాస్టర్, అలనాటి నటి ‘రోజ’తో కలిసి స్టెప్ లు వేయడంతో.. ఆ షో TRP రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.
ఇప్పుడు డాన్స్ ఐకాన్ షో నిర్వాహకులు కూడా ఇదే స్ట్రాటజీని ప్లే చేస్తునట్టు, తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తుంది. మరి శేఖర్, రమ్యకృష్ణల కెమిస్ట్రీ ఈ షోకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. కాగా ఈ రియాలిటీ షోకు ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
