Kalki – Suman : సినిమా చాలా స్లో ఉంది.. ప్రభాస్‌ని సరిగ్గా చూపించలేదు.. కల్కి సినిమాపై సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు..

తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడుతూ..

Senior Actor Suman Sensational Comments on Prabhas Kalki Movie

Kalki – Suman : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ విజయం సాధించి 1000 కోట్ల కలెక్షన్స్ తక్కువ రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కల్కి విజయంపై మూవీ యూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీశారని, దిశా పటాని లేకపోయినా కథ బాగానే సాగుతుందని కొంతమంది కామెంట్స్ చేసారు.

తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. కల్కి సినిమా చాలా స్లోగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక అరగంట తీసేయొచ్చు. ముఖ్యంగా ఆ బాంబే హీరోయిన్ సాంగ్, ఫైట్ తీసేయొచ్చు. అసలు అది కథకు సంబంధమే లేదు. సెకండాఫ్ బాగుంది. డైరెక్టర్ విజన్ కి సెల్యూట్. కానీ సినిమాలో అమితాబ్ రోల్ చాలా డామినేట్ గా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ ని ఒక టార్జాన్ లా చూపించాలి. ఇందులో ఏదో ప్లేట్ పెట్టి, బాడీకి షీల్డ్ పెట్టి కవర్ చేసేసారు. ప్రభాస్ కి మంచి ఫిజిక్ ఉంది, అది సినిమాలో ఎక్కడైనా చూపిస్తారేమో అనుకున్నాను. సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు. ఈ సినిమాని ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తేనే నచ్చుతుంది అని అన్నారు. దీంతో సుమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Sitara : హాలీవుడ్‌ భామతో మ‌హేశ్ కూతురు సితార.. సెల్ఫీ పిక్స్ వైర‌ల్‌..

అయితే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. మీరు కూడా చేస్తే బాగుండేది అనుకున్నారా అని అడగ్గా.. కల్కిలో నేను చేసే క్యారెక్టర్ ఏమి లేదు. చాలా మంది అతిధి పాత్రల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. మనం ఒక పాత్ర చేస్తే అది గుర్తుండిపోవాలి. సినిమాలో అంతమంది స్టార్స్ ఉన్నప్పుడు అంచనాలు ఉంటాయి. అది లేకపోతే ఫ్యాన్స్ నిరాశ పడతారు. చాలా మంది చేసే తప్పు ఇదే. ఇలా స్టార్స్ ని ఎక్కువ మందిని పెట్టేసి జనాల్ని థియేటర్స్ కి రప్పించాలనుకుంటారు అని అన్నారు సుమన్.

ట్రెండింగ్ వార్తలు