Transfer Trimurthulu: యాక్షన్ మోడ్‌లో వడ్డే నవీన్.. అంచనాలను పెంచుతున్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్
వడ్డే నవీన్ హీరోగా వస్తున్న యాక్షన్ మూవీ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు(Transfer Trimurthulu)’ టీజర్ విడుదల అయ్యింది.
- V Santhosh Kumar
- Published on- May 21, 2026 / 04:46 PM IST
Senior Hero Vadde Naveen Transfer Trimurthulu Movie Teaser Released
- వడ్డే నవీన్ గ్రాండ్ కంబ్యాక్.
- ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు టీజర్ విడుదల.
- పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రచ్చ.
Transfer Trimurthulu: టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా కాలం విరామం తర్వాత మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu) నుంచి తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాతో వడ్డే నవీన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆయన సరసన టాలెంటెడ్ బ్యూటీ రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాలో వడ్డే నవీన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో ఆయన నటించిన పోలీస్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, ఇప్పుడు మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించి యాక్షన్ మోడ్‌లోకి దిగారు. తాజాగా విడుదలైన టీజర్‌లో వడ్డే నవీన్ లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’ వంటి చిత్రాలతో అలరించిన నాటి నవీన్ గ్లామర్, ఇంటెన్సిటీ ఇప్పటికీ తగ్గలేదని టీజర్ ప్రూవ్ చేస్తోంది.
ఈ టీజర్ చూసిన నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. “అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా వడ్డే నవీన్ అలానే ఉన్నారు.. వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్!” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో దర్శకుడు కమల్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత వడ్డే నవీన్ చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి కంబ్యాక్ ను అందిస్తుంది అనేది చూడాలి.
