Suhana Khan : మా నాన్న వల్ల వచ్చే గుర్తింపు నాకు అవసరం లేదు.. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా!
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.. తన తండ్రి వల్ల వచ్చే గుర్తింపు తనకి అవసరం లేదంటూ బహిరంగంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్..
- gum 95921
- Published On : May 22, 2023 / 06:55 PM IST
Shah Rukh Khan daughter Suhana Khan viral comments on her father fame
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గురించి అందరికి తెలిసిందే. ఈ భామ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్న ‘ది ఆర్చీస్’ (The Archies) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాగా నేడు (మే 22) సుహానా ఖాన్ తన 23వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సుహానా.. షారుఖ్ ఖాన్ కూతురుగా గుర్తింపు తనకి అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Ram Charan : G20 సమ్మిట్‌లో రామ్ చరణ్ ‘నాటు నాటు’ స్టెప్.. వీడియో వైరల్!
సుహానాకి 5 ఏళ్ళ వయసు వచ్చే వరకు తన తండ్రి షారుఖ్ ఎంత ఫేమస్ అనే విషయం తెలియలేదట. అయితే ఒకసారి తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి షారుఖ్ ఖాన్ వెళ్ళినప్పుడు.. అందరూ తననే చూస్తూ ఉన్నారు అంటా. “షారుఖ్ ఖాన్ కూతురిగా నా మీద దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. అది నాకు నచ్చలేదు. వెంటనే నేను మా నాన్నని కారులోకి నెట్టేశాను. అప్పుడే నాకు నేనుగా నిర్ణయించుకున్నా.. మా నాన్న వల్ల వచ్చే గుర్తింపు నాకు అవసరం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Ram Charan : 2016లో ఇదే ఆడిటోరియంలో సినిమా షూట్ చేశాం.. ఇప్పుడు సమ్మిట్‌లో పాల్గొన్నా.. రామ్‍చరణ్!
ఇక షారుఖ్ ఖాన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం జవాన్ (Jawan), డంకీ (Dunki) సినిమాల్లో నటిస్తున్నాడు. జవాన్ సినిమాని సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. డంకీ చిత్రాన్ని PK, 3 ఇడియట్స్ వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు. పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమాలు కావడంతో వీటి పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాలతో పాటు సల్మాన్ ఖాన్ టైగర్ 3 లో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నాడు.
