Dunki : సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ‘డంకీ’.. ఏ ఓటీటీలో?

తాజాగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Shah Rukh Khan Dunki Movie Streaming in OTT Full Details Here

Dunki OTT Release : షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), తాప్సీ(Tapsee) జంటగా విక్కీ కౌశల్(Vicky Kaushal) ముఖ్య పాత్రలో రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డంకీ’. గత సంవత్సరం డిసెంబర్ 21న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. పఠాన్, జవాన్ సినిమాల తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ హిట్ కొట్టకపోయినా ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులని మెప్పించి 450 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది డంకీ సినిమా.

ఇక డంకీ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. లండన్ వెళ్లి బాగా బతకాలనుకొనే కొంతమంది వీసా రిజెక్ట్ అవ్వడంతో అడ్డదారిలో దేశాలు దాటుతూ ఎలా వెళ్లారు? వెళ్లే మార్గంలో ఎన్ని కష్టాలు పడ్డారు? వెళ్ళాక ఏమైంది అనే కథాంశంతో ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఓ సోషల్ మెసేజ్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా డంకీ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

Also Read : Varun Lavanya : బాబోయ్.. వరుణ్, లావణ్య.. ఒకరి గురించి ఒకరికి ఇంత బాగా తెలుసా? ఇది మాములు పర్ఫెక్ట్ జోడి కాదు..

ఎలాంటి ప్రకటన లేకుండానే డంకీ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో డంకీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. డంకీ కేవలం హిందీ భాషలో మాత్రమే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో డంకీ చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు