Jawan Collections : బాక్సాఫీస్ పై బాలీవుడ్ బాద్ షా దండయాత్ర.. నాలుగు రోజుల్లో 520 కోట్లు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 11, 2023 / 04:40 PM IST
awan movie collects 500cr just 4 days
Jawan 4 Days Collections : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.520 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు సార్లు రూ.500 కోట్లకు పై గా కలెక్షన్లు అందించిన మొదటి నటుడిగా చరిత్ర సృష్టించాడు.
Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ రూలింగ్ అప్పటి నుంచే..
మొదటి రోజు ఈ సినిమా రూ.125.05 కోట్లు, రెండవ రోజు రూ.109.24 కోట్లు, మూడో రోజు రూ.140.17 కోట్లు వసూలు చేయగా ఆదివారం నాలుగో రోజు ఏకంగా రూ.156.08కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 28.76 లక్షల టికెట్లు అమ్ముడు అయ్యాయి. భారతీయ సినీ చరిత్రలో ఇంత వరకు ఒక్క రోజులో అమ్ముడైన టికెట్లలో ఇదే రికార్డు అని చెబుతున్నారు. జవాన్ ఊపు చూస్తుంటే ఈ సినిమా ఈజీగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Bigg Boss 7 : వాడీ వేడీగా నామినేషన్స్ ప్రక్రియ.. నేను ఎవరి మాట వినను అన్న శివాజీ.. అంతలేదమ్మా
జవాన్ చిత్రంలో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్‌గా కనిపించారు. ప్రియమణి, దీపికా పదుకొనే, సాన్య మల్హోత్ర, సంజయ్‌దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
