Jawan : బ్లాక్ బస్టర్ టెలివిజన్ ప్రీమియర్.. టీవిలో షారుఖ్ ‘జవాన్’ అప్పుడే..
బ్లాక్ బస్టర్ టెలివిజన్ ప్రీమియర్ 'జవాన్' టీవిలో ప్రసారమయ్యేది అప్పుడే..
- gum 95921
- Published On : March 13, 2024 / 04:17 PM IST
Shah Rukh Khan Jawan premiered in telugu channel update
Jawan : తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా నయనతార, దీపికా పదుకోన్ హీరోయిన్స్‌గా కనిపించారు. తమిళ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.
ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని షారుఖ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. షారుఖ్ కెరీర్ లోనే కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా టాప్ మూవీ ప్లేస్ లో నిలిచింది. థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి.. అక్కడ కూడా రికార్డు స్థాయి వ్యూస్ ని అందుకొని సంచలనంగా నిలిచింది. ఇక ఇప్పుడు టెలివిజన్ వంతు వచ్చింది. టెలివిజన్ రంగంలో కొత్త టిఆర్పిని సెట్ చేయడానికి సిద్దమవుతుంది.
Also read : Allu Arjun : అల్లు అర్జున్ పాటకి హాలీవుడ్ పాప్ సింగర్ డాన్స్.. వీడియో వైరల్
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో ముందుకు దూసుకుపోతున్న జీ తెలుగులో ఈ సినిమా ప్రీమియర్ కాబోతుంది. మార్చి 17న ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతుంది. మరి ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఫ్యామిలీతో కలిసి బుల్లితెర పై చూసి ఎంజాయ్ చేసేయండి.
