Shah Rukh Khan ThumsUp Ad : పఠాన్ రేంజ్‌లో షారుఖ్ థమ్సప్ యాడ్..
కూల్ డ్రింక్ థమ్సప్ యాడ్స్ మనం టీవిలో చూస్తూనే ఉంటాము. సాధారణ యాడ్స్ లా కాకుండా మూవీ రేంజ్ లో థమ్సప్ యాడ్స్ ఉంటాయి. తాజాగా థమ్సప్ తన కొత్త యాడ్ ని రిలీజ్ చేసింది. దాదాపు 90 సెకండ్స్ ఉన్న ఈ యాడ్ లో షారుఖ్ చేసిన యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
- gum 95921
- Published On : February 9, 2023 / 11:35 AM IST
Shah Rukh Khan ThumsUp Ad
Shah Rukh Khan ThumsUp Ad : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ బాద్‌షా అనిపించుకున్నాడు. గత కొంత కాలంగా బాయ్‌కాట్ ట్రెండ్ మరియు సరైన కథలతో బాలీవుడ్ సినిమాలు రాకపోవడంతో అమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నష్టాన్ని మిగిలిచాయి. షారుఖ్ పఠాన్ పై కూడా రిలీజ్ కి ముందు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ విడుదల అయ్యాక బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రెండు వారాలు పూర్తి అయినా కూడా పఠాన్ కలెక్షన్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
Pathaan: పఠాన్ @ వెయ్యి కోట్ల మార్క్.. మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందిగా!
ఇక విషయానికి వస్తే.. కూల్ డ్రింక్ థమ్సప్ యాడ్స్ మనం టీవిలో చూస్తూనే ఉంటాము. సాధారణ యాడ్స్ లా కాకుండా మూవీ రేంజ్ లో థమ్సప్ యాడ్స్ ఉంటాయి. తాజాగా థమ్సప్ తన కొత్త యాడ్ ని రిలీజ్ చేసింది. పఠాన్ సినిమాలో షారుఖ్ చేసిన యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా విజయంలో యాక్షన్ సీక్వెన్స్ మేజర్ రోల్ ప్లే చేశాయి. దీంతో థమ్సప్ కొత్త యాడ్ కి ఈ థీమ్ నే ఎంచుకొని, షారుఖ్ తో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ యాడ్ చేశారు. దాదాపు 90 సెకండ్స్ ఉన్న ఈ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
పఠాన్ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ ని తలపించేలా ఉన్న ఈ యాడ్ ని చూసి.. పఠాన్ లోని ఒక సీన్ అని భ్రమ పడుతున్నారు చాలామంది. కాగా పఠాన్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ.446.20 కోట్ల నెట్ షేర్ సాధించింది. దీంతో హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కేజీఎఫ్-2 సెట్ చేసిన రికార్డుని బ్రేక్ చేసింది. ఇలాగే మరికొన్ని రోజులు కలెక్షన్స్ లో జోరు చూపిస్తే హిందీ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయడంలో కూడా సందేహం లేదు అంటున్నారు సినిమా పండితులు. ఏదేమైనా ఈ సినిమాతో షారుఖ్.. బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకు వచ్చాడు అనే చెప్పాలి.
[FULL HD]: King #ShahRukhKhan in latest #ThumsUp TVC advert.#Pathaan pic.twitter.com/EedB3Lk4Hb
— Team Shah Rukh Khan Fan Club (@teamsrkfc) February 8, 2023
