×
Ad

Jawan Twitter Review : జవాన్ ట్విట్టర్ రివ్యూ.. బాలీవుడ్ బాద్‌షా ఇంకోసారి తన సత్తా చాటాడా?

సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది జవాన్. ఇప్పటికే పలు చోట్ల షోలు పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

  • Published On : September 7, 2023 / 06:29 AM IST

Shahrukh Khan Nayanathara Jawan Movie Twitter Review and Audience Ratings

Jawan Twitter Review : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నేడు సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చాడు. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది జవాన్. ఇప్పటికే పలు చోట్ల షోలు పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజే 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. జవాన్ లో షారుఖ్ మాస్ ఎంట్రీ అదిరిపోయిందని, సినిమా యాక్షన్ ప్యాక్ గా ఉందని, హిట్ సినిమా అని కామెంట్స్ చేస్తున్నారు.