Shakeela: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని.. ‘తాయ్ కిళవి’ పాత్రపై షకీలా సంచలన వ్యాఖ్యలు!
సీనియర్ నటి రాధిక నటించిన తాయ్ కిళవి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా(Shakeela).
- V Santhosh Kumar
- Published on- May 11, 2026 / 06:34 PM IST
Shakeela shocking comments on Radhika thaai kizavi movie
- రాధిక కంటే నేనే బాగా చేస్తాను
- షకీలా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి
- తాయ్ కిళవి పాత్రపై షకీలా ధీమా
Shakeela: ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు సైతం పోటీనిచ్చిన నటి షకీలా(Shakeela). ఈ నటి ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియా, ఇంటర్వ్యూల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో నటించిన ‘తాయ్ కిళవి’ సినిమా గురించి ప్రస్తావిస్తూ, ఆ పాత్రలో రాధిక కంటే నేను నటించగలనని షకీలా ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించడం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, అందుకే అలాంటి గడుసు వృద్ధురాలి పాత్రలో తాను ఇంకా బాగా ఒదిగిపోయేదాన్నని షకీలా పేర్కొన్నారు. రాధిక నటించిన ‘తాయ్ కిళవి’ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం చుట్టూ సాగే ఈ కథలో, పపుంతాయ్ అనే పాత్రలో రాధిక అద్భుతమైన నటనను కనబరిచారు.
శివకార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా, హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. మహిళల ఆలోచనా దృక్పథాన్ని మార్చే విధంగా సాగే ఈ సినిమాలోని లీడ్ రోల్ విషయంలో షకీలా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్‌బాస్ 7వ సీజన్‌లో పాల్గొని త్వరగానే ఎలిమినేట్ అయిన షకీలా, మళ్ళీ ఇలాంటి బలమైన పాత్రల ద్వారా వెండితెరపై తన ముద్ర వేయాలని ఆశిస్తున్నారు.
