Shanmukh Jaswanth : కాబోయే భార్యతో డ్యాన్సలేసి.. నిశ్చితార్థంలో రచ్చ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. వీడియో వైరల్..
షణ్ముఖ్ నేడు తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు. (Shanmukh Jaswanth)
- Saketh U
- Published On : February 25, 2026 / 08:44 PM IST
Shanmukh Jaswanth
Shanmukh Jaswanth : కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాటు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని షణ్ముఖ్ జస్వంత్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో కొన్నాళ్ళు దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ అయింది.(Shanmukh Jaswanth)
ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు పరిచయం చేసిన షణ్ముఖ్ నేడు తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ – వైష్ణవి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ గా మారగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Buchibabu Sana : పెద్ది రిలీజ్ అవ్వకుండానే.. బుచ్చిబాబుకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడా?
ఫొటోలతో పాటు ఓ వీడియో కూడా షేర్ చేసి మరింత వైరల్ అవుతున్నాడు షన్ను. నిశ్చితార్థ వేడుకల్లో తనకు కాబోయే భార్యతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేసాడు షణ్ముఖ్. డ్యాన్స్ చేస్తూ వైష్ణవిని ఎత్తుకొని తిప్పాడు కూడా. నిశ్చితార్థ వేడుకల్లో షణ్ముఖ్ – వైష్ణవి సంతోషంతో ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు ఈ వీడియోతో తెలుస్తుంది. దీంతో షణ్ముఖ్ జస్వంత్ – వైష్ణవి డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.
మీరు కూడా షణ్ముఖ్ – వైష్ణవి నిశ్చితార్థంలో డ్యాన్స్ చేసిన వీడియో చూసేయండి..
