Shannu-Deepu : సోషల్ మీడియా స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్‌లకు ఇటీవల బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీళ్ళు ఇటీవల విడిపోయారు. షణ్ముఖ్ బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక దీప్తి బ్రేకప్ చెప్పింది. అంతకు ముందే షన్ను ఫోన్ నంబర్ ని బ్లాక్ చేసినట్లు, ఇంస్టాగ్రామ్ లో షన్నుని అన్ ఫాలో చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో షణ్ముఖ్ తో విడిపోతున్నట్టు అధికారిక పోస్ట్ పెట్టింది. షణ్ముఖ్ కూడా దీప్తి వెళ్లిపోవడంతో తాను బాగుండాలి ఎక్కడ ఉన్నా అంటూ పోస్ట్ చేశాడు.
Salman Khan : ముగ్గురు హీరోలు.. 10 మంది హీరోయిన్లు.. బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్ ప్రయోగం
గతంలో కలిసి నటించి, ఎక్కువగా కలిసి తిరిగే వాళ్ళు బ్రేకప్ తర్వాత అసలు కలవడం, మాట్లాడటం లాంటివి లేవని సమాచారం. తాజాగా బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ దీప్తి కోసం చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇవాళ జనవరి 10న దీప్తి సునైన బర్త్‌డే సందర్భంగా.. ‘హ్యాపీ బర్త్‌డే D’ అంటూ దీప్తితో కలిసి దిగిన పాత ఫోటోను షణ్ముఖ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన ‘మలుపు’ షార్ట్ ఫిలిం సాంగ్‌ను జత చేశాడు. దీంతో షణ్ముఖ్ ఇంకా దీప్తిని మర్చిపోలేదని అభిమానులు కామెంట్స్ చేస్తూ దీప్తి సునైనాకి హ్యాపీ బర్త్ డే చెప్తున్నారు. అయితే దీనిపై దీప్తి ఇంతవరకు స్పందించలేదు.