Shahrukh Khan : లేట్ అయింది.. కానీ డేట్ గుర్తు పెట్టుకోండి.. ఎట్టకేలకు రాబోతున్న ‘పఠాన్’
కొన్ని రోజుల క్రితమే షారుఖ్ 'పఠాన్' సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం 'పఠాన్' సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చాడు. 'పఠాన్' సినిమా......
- Saketh U
- Published on- March 3, 2022 / 10:03 AM IST
Pathaan
వీటన్నిటినుంచి తేరుకొని కొన్ని రోజుల క్రితమే షారుఖ్ ‘పఠాన్’ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చాడు. ‘పఠాన్’ సినిమా నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు షారుఖ్. ఈ గ్లింప్స్ లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనె కనిపించగా షారుఖ్ షాడో మాత్రం కనిపించి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
Andrei Koscheev : శ్రియ భర్తకి సర్జరీ.. పాపని కూడా ఎత్తుకోలేకపోయాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..
షారుఖ్ ఈ గ్లింప్స్ ని షేర్ చేస్తూ.. ”చాలా ఆలస్యం అయ్యిందని నాకు తెలుసు. కాని డేట్ గుర్తు పెట్టుకోండి. ‘పఠాన్’ టైం వచ్చింది. 2023 జనవరి 25న బిగ్ స్క్రీన్‌పై కలుసుకుందాం” అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ‘పఠాన్’ సినిమా 2023 జనవరి 25న రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించగా యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో 50వ సినిమాగా రూపొందుతుంది. ‘పఠాన్’ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలతో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు.
