Shobha Shetty : పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి..

పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి. ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్, పెళ్లి..

Shobha Shetty : పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి..

Shobha Shetty yashwanth pelli tambulalu video gone viral

Shobha Shetty : కార్తీకదీపం సీరియల్ లో మోనిత పాత్రతో విలనిజం చూపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘శోభాశెట్టి’. ఇక ఇటీవల బిగ్‌బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, చివరి వరకు ఉండి, గట్టి పోటీ ఇచ్చి.. ఆడియన్స్ లో మరింత ఫేమ్ ని సంపాదించుకున్నారు. కాగా బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నప్పుడే.. శోభాషెట్టి తన ప్రియుడిని అందరికి పరిచయం చేశారు.

తనతో పాటు కార్తీకదీపం సీరియల్ లో నటించిన యశ్వంత్ తో శోభా ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. తాజాగా ఆ పెళ్ళికి మొదటి అడుగైన తాంబూలాల కార్యక్రమాన్ని జరుపుకున్నారు. జనవరి 20న శోభాషెట్టి బర్త్ డే. ఆరోజు ప్రతి ఏడాది తమ ఇంటిలో పూజలు వ్రతాలు నిర్వహిస్తారంటా. ఇక ఈ ఏడాది వాటితో పాటు పెళ్లి తాంబూలాలు కార్యక్రమాన్ని కూడా జరుపుకున్నారు.

Also read : Balakrishna : బాలకృష్ణ గారి కోసం రెండు కథలు సిద్ధం చేశా.. ఒకటి సూపర్ హీరో మూవీ.. ప్రశాంత్ వర్మ

శోభాషెట్టి, యశ్వంత్ తమ కుటుంబసభ్యుల మధ్య పెళ్లి తాంబూలాల వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అలాగే బర్త్ డేని కూడా అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని శోభాషెట్టి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇక ఇదే వీడియోలో శోభా మాట్లాడుతూ.. ప్రస్తుతం యశ్వంత్ అండ్ తను, తమ కెరీర్ లో బిజీగా ఉన్నట్లు, డేట్స్ అన్ని చూసుకొని త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటామంటూ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ పెళ్లి తాంబూలాలు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా శోభాషెట్టి, యశ్వంత్ కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. త్వరలోనే పెళ్లి వార్త కూడా చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తన పై ఇంత ప్రేమ చూపిస్తున్న ఆడియన్స్ కి శోభా కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఈ జంట ఏడడుగులు ఎప్పుడు వేయబోతున్నారో చూడాలి.