Balakrishna : బాలకృష్ణ గారి కోసం రెండు కథలు సిద్ధం చేశా.. ఒకటి సూపర్ హీరో మూవీ.. ప్రశాంత్ వర్మ

బాలకృష్ణ కోసం రెండు కథలు సిద్ధం చేశానంటున్న 'హనుమాన్' మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ రెండిటిలో ఒకటి సూపర్ హీరో మూవీ..

Balakrishna : బాలకృష్ణ గారి కోసం రెండు కథలు సిద్ధం చేశా.. ఒకటి సూపర్ హీరో మూవీ.. ప్రశాంత్ వర్మ

Prasanth Varma narrated two stories to Balakrishna one as super hero movie

Updated On : January 25, 2024 / 10:10 AM IST

Balakrishna : ‘హనుమాన్’ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. నటసింహ బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బాలయ్యకి కథ కూడా వినిపించాను అంటూ ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా రిలీజైన హనుమాన్ మూవీ చూసిన నందమూరి అభిమానులు.. ప్రశాంత్ వర్మ, బాలయ్యతో ఎప్పుడు సినిమా మొదలు పెడతారో అని ఎదురు చూస్తున్నారు.

అలాగే ఆ సినిమా కథ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి మొదలైంది. ఎందుకంటే, హనుమాన్ మూవీతో సూపర్ హీరో యూనివర్స్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఆ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు తీసుకు వస్తానంటూ ప్రకటించారు. ఇక బాలయ్యతో చేయబోయే సినిమా కూడా సూపర్ హీరో యూనివర్స్ లోనే ఉంటుందా..? అనే సందేహం ఫ్యాన్స్ లో నెలకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ దీనికి ఓ క్లారిటీ ఇచ్చారు.

Also read : Kartikeya : చిరంజీవి గారి సినిమా బాగా రావాలి.. దర్శకుడికి హీరో కార్తికేయ హెచ్చరిక..

ప్రశాంత్ వర్మ, బాలయ్యకి రెండు కథలని వినిపించారట. ఆ రెండిటిలో ఒకటి సూపర్ హీరో మూవీ అని తెలియజేశారు. మరొకటి ఒక మాస్ మూవీ అంట. ఇక రెండిటిలో బాలయ్య ఏది ఫైనల్ చేస్తే.. దానిని అభిమానుల ముందుకు తీసుకు వస్తానంటూ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. మరి బాలయ్య ఏది ఎంపిక చేస్తారో చూడాలి. ఇటీవల హనుమాన్ చిత్రాన్ని స్పెషల్ షో వేసి మరి బాలయ్యకి ప్రశాంత్ వర్మ చూపించారు.

సినిమా చూసిన బాలయ్య, ప్రశాంత్ వర్మని ప్రశంసలతో ముంచెత్తారు. మరి ప్రశాంత్ వర్మ కథకి ఎప్పుడు సిగ్నల్ ఇస్తారో చూడాలి. కాగా ప్రశాంత్ వర్మ లైనప్ లో ప్రస్తుతం అధీర, జై హనుమాన్, మహాకాళి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. జై హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ, బాలయ్య సినిమా చేయొచ్చు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీతో NBK109 ని తెరకెక్కిస్తున్నారు.