Kartikeya : చిరంజీవి గారి సినిమా బాగా రావాలి.. దర్శకుడికి హీరో కార్తికేయ హెచ్చరిక..

చిరంజీవి గారి సినిమా బాగా రావాలంటూ ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠకు హీరో కార్తికేయ హెచ్చరిక.

Kartikeya : చిరంజీవి గారి సినిమా బాగా రావాలి.. దర్శకుడికి హీరో కార్తికేయ హెచ్చరిక..

Kartikeya warn Chiranjeevi VISHWAMBHARA movie director Vassishta about movie

Updated On : January 25, 2024 / 9:31 AM IST

Kartikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సందర్భాల్లో చాలా వేదికల పై కార్తికేయ, చిరంజీవి పై తమ అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు. భోళాశంకర్ విషయంలో చిరంజీవి పై అనేక ట్రోల్స్ వస్తున్న సమయంలో కూడా కార్తికేయ తన అభిమానాన్ని చూపుతూ.. ఆ ట్రోల్స్ పై అసహనం వ్యక్తం చేశారు.

ఇక రీసెంట్ గా ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి నెక్స్ట్ మూవీ దర్శకుడికి హెచ్చరిక జారీ చేశారు. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నైట్ హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ, దర్శకులు గోపీచంద్ మలినేని, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదిక మాట్లాడుతూనే కార్తికేయ.. దర్శకుడు వశిష్ఠకి హెచ్చరిక జారీ చేశారు.

Also read : Prasanth Varma : రామాయణం వాళ్ళు తియ్యకపోతే.. నేను కచ్చితంగా చేస్తా..

చిరంజీవి 156వ సినిమా ‘విశ్వంభర’ని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భోళాశంకర్ సినిమా ప్లాప్ తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ అంతా.. ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలతోనే కార్తికేయ మాట్లాడుతూ.. “ఒక ఫ్యాన్ గా చెబుతున్నా సార్, విశ్వంభర అదిరిపోవాలి. పూర్తి భాద్యత మీ మీదనే పెడుతున్నాము” అంటూ హెచ్చరిస్తూ మాట్లాడి చివరిలో.. ”ఇది రిక్వెస్ట్ అనుకోండి” అంటూ చిరు పై తన వీరాభిమానిని తెలియజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ‘విశ్వంభర’ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఈ నెలాఖరు నుంచి చిరంజీవి కూడా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. మారేడుమిల్లి అడవుల్లో ఈ షూటింగ్ జరగనుంది. దాదాపు 70 శాతం షూటింగ్ ని VFX పై చిత్రీకరించనున్నారు. రీసెంట్ ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.