Prasanth Varma : రామాయణం వాళ్ళు తియ్యకపోతే.. నేను కచ్చితంగా చేస్తా..

రామాయణం వాళ్ళు తియ్యకపోతే, నేను కచ్చితంగా చేస్తాను అంటూ ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇంతకీ వాళ్ళు ఎవరు..?

Prasanth Varma : రామాయణం వాళ్ళు తియ్యకపోతే.. నేను కచ్చితంగా చేస్తా..

Prasanth Varma said he will do Ramayana movie if bollywood will not make it

Updated On : January 24, 2024 / 8:55 PM IST

Prasanth Varma : ‘హనుమాన్’ సినిమాతో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పేరు ఇండియా వైడ్ గట్టిగా వినిపిస్తుంది. తక్కువ బడ్జెట్ తో హనుమాన్ మూవీలో ప్రశాంత్ వర్మ చూపించిన గ్రాఫిక్స్‌కి, అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. దీంతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. హనుమాన్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు తెరకెక్కించబోతున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్స్ గురించి ప్రశాంత్ వర్మ ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇక ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ రామాయణ టాపిక్ చర్చకి వచ్చింది. నితీష్ తివారి రామాయణ కథని మూడు పార్టులుగా తెరకెక్కించబోతున్నారని, అందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also read : Love & War : అలియా, రణబీర్, విక్కీ కాంబోలో మూవీ.. భన్సాలీ మరో ‘ఆషీకీ’ తీయబోతున్నారా..!

ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “రామాయణ కథ మన జీవితాశైలిని సరైన దారిలో నడిచేలా చేస్తుంది. అందుకే ప్రతి జనరేషన్ కి రామాయణం చెప్పాల్సిన అవసరం మనకి ఉంది. ఆ కథని చెప్పడంలో కూడా మనం పద్ధతిగా వ్యవహరించాలి. ఒకవేళ రామాయణం వాళ్ళు తియ్యకపోతే, నేను కచ్చితంగా చేస్తా” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ప్రశాంత్ వర్మ మహాభారతం కూడా తెరకెక్కించాలని అనుకున్నట్లు, కానీ రాజమౌళి మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ గా పెట్టుకోవడంతో.. తాను తెరకెక్కించాలి అనే ఆలోచనని విరమించుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక హనుమాన్ సినిమా చూసిన తరువాత ఆడియన్స్ ప్రశాంత్ వర్మ.. రామాయణ, మహాభారతం తీస్తే అదిరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.