Trikala : మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న శ్రద్ధా దాస్ మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌..

త్రికాల సినిమా ఓటీటీలలో మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. (Trikala)

  • Published on- July 11, 2026 / 07:47 PM IST

Trikala

Trikala : శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితీ అవాంచ.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా త్రికాల. ఇటీవల మే 28న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనే ఉప‌శీర్షిక‌తో మొదటి భాగంగా ఈ సినిమా వచ్చింది. మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌, హారర్ కథాంశంతో ఈ త్రికాల సినిమా తెరకెక్కింది.

థియేటర్లలో పర్వాలేదనిపించింది త్రికాల సినిమా ఓటీటీలలో మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఒకేసారి మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవ్వడం గమనార్హం. ప్రస్తుతం త్రికాల సినిమా జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్.. ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఐఎండీబీలో కూడా 9.1 రేటింగ్ అందుకుంది ఈ సినిమా.

Also Read : Pramod Panju : అప్పుడు ‘సలార్’.. ఇప్పుడు ‘లెనిన్’.. ప్రీ క్లైమాక్స్ లో అఖిల్ ని డామినేట్ చేసిన ఈ నటుడు ఎవరో తెలుసా?

డైరెక్టర్ మణి తెల్లగూటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ, పునర్జన్మల వైవిధ్యంతో పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను చూపించారు.