Shruti Haasan Peddi: ‘పెద్ది’ మెగా మాస్ సాంగ్ లో శృతి హాసన్.. ఇన్‌స్టా పోస్ట్‌తో అఫీషియల్ కన్ఫర్మేషన్

Shruti Haasan Peddi Song Update: రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న శృతి హాసన్.

shruti haasan doing special song in ram charan peddi movie

  • ముగిసిన ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూటింగ్.
  • రామ్ చరణ్ పక్కన మెరవనున్న శృతి హాసన్.
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన రానుంది.

Shruti Haasan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (RC16). గ్రామీణ నేపథ్యంలో క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ మేకోవర్, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

*అమ్మోరు దిగినాది.. పూనకాలు తెప్పించినాది.. ‘అనకాపల్లి’ మూవీ జాతర సాంగ్ వైరల్

ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ శృతి హాసన్‌ను ఎంపిక చేశారు. తన డాన్స్, ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే శృతి, ఈ మాస్ నంబర్‌లో చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ప్యాక్ అప్’ అంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీని ద్వారా తన వంతు షూటింగ్ పూర్తయిందని శృతి హాసన్ అధికారికంగా ధృవీకరించింది. చరణ్, శృతి హాసన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చూసి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఎట్టకేలకు ‘పెద్ది (Peddi)’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ నిర్మాణానంతర పనులపై దృష్టి సారించింది. భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో అని సినీ వర్గాలు, మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.