సినిమా షూటింగ్ అని చెప్పి.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు.. సిద్ధార్థ్, అతిథి పెళ్లి ఎలా జరిగిందంటే..?
సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అతిథి. వనపర్తిలో ఈ పెళ్లి ఎలా జరిగిందంటే..?
- gum 95921
- Published On : March 28, 2024 / 10:31 AM IST
Siddharth Aditi Rao Hydari marriage news update and videos
Siddharth – Aditi Rao Hydari : గత కొంతకాలంగా సిద్దార్థ్, అదితిరావు హైదరి చెట్టపట్టాలు ఏసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తెరకెక్కిన ‘మహాసముద్రం’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో.. డేటింగ్ చేస్తున్నారని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా వచ్చారు.
కాగా నిన్న మార్చి 27న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వినిపించాయి. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే సిద్ధార్థ్, అతిథి నుంచి మాత్రం ఇప్పటివరకు ఈ పెళ్లి గురించి ఎటువంటి అప్డేట్ లేదు. అయితే ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న విషయం ఏంటంటే.. సిద్ధార్థ్, అతిథి సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారట.
Also read : Ram Charan : RC16 సాంగ్స్ అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు.. ఆల్రెడీ మూడు సాంగ్స్..
వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వర రావు కూతురు అతిథి రావు హైదరి తల్లి ‘విద్యారావు’. ఈ వారసత్వంతోనే వీరి పెళ్లిని వనపర్తిలో నిర్వహించారు. ఈ వివాహానికి జే రామేశ్వర రావు వారసులు జే కృష్ణదేవర రావు కుటుంబం హాజరయ్యిందట. ఇక ఈ పెళ్లిని సిద్ధార్థ్, అతిథి అత్యంత రహస్యంగా చేసుకున్నారు. ఈ పెళ్లి చేయడం కోసం తమిళనాడు నుంచి పూజారులు వచ్చారట.
శ్రీరంగపురం టెంపుల్‌లో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పారట. అంతేకాదు స్థానిక పూజారులను ఆ సమయంలో లోపలికి కూడా అనుమంతించలేదట. ప్రస్తుతం ఆ పెళ్ళికి సంబంధించిన డెకరేషన్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సిద్ధార్థ్, అతిథి నిజంగానే పెళ్లి చేసుకున్నారా..? లేదా వాళ్ళు చెప్పినట్లు సినిమా షూటింగేనా..? అనేది తెలియాల్సి ఉంది.
పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి
పెబ్బేరు మండలం శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో సినీ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి వివాహం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో అత్యంత రహస్యంగా వివాహం.
సినిమా షూట్ అని ముందుగా చెప్పినట్లు… pic.twitter.com/QIRUdNUXuP
— Telugu Scribe (@TeluguScribe) March 27, 2024
