×
Ad

Radhan : చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు.. తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌పై తెలుగు మేకర్స్ ఆగ్రహం..

చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు అంటూ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ పై తెలుగు మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published On : February 22, 2024 / 04:03 PM IST

Siddharth Roy director fires on Tamil Music director Radhan video viral

Radhan : తెలుగు సినిమా పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత కనిపిస్తుంది. దీంతో తెలుగు మేకర్స్ అంతా ఇతర పరిశ్రమ సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ విషయమే ఇప్పుడు తెలుగు మేకర్స్ కి పెద్ద తలనొప్పిగా మారుతుందట. ఈక్రమంలోనే ఓ తమిళ సంగీత దర్శకుడు తెలుగు దర్శకులను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడట.

తాజాగా ఓ తెలుగు డైరెక్టర్.. ‘చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసారు. అసలు ఏమైందంటే.. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘సిద్దార్థ్ రాయ్’ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సంగీతం అందించారు. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడానికి రధన్ చాలా ఇబ్బందులు పెట్టాడంట.

Also read : త్రిషతో అంత ఈజీ కాదు.. పొలిటికల్ లీడర్‌కి లాయర్ నోటీసులు.. ఇక తగ్గేదేలే..

‘సిద్దార్థ్ రాయ్’ డైరెక్టర్ యశస్వి, రధన్ గురించి మాట్లాడుతూ.. “నాలా మరొకరు మోసపోకూడదని ఇప్పుడు ఈ విషయం చెబుతున్నాను. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ, రధన్ వల్ల పోస్టుప్రొడక్షన్ లేటు అవుతూ వచ్చింది. మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావొచ్చు. కానీ అది దృష్టిలో పెట్టుకొని మన సినిమా తీసుకోని వెళ్లి అతని చేతిలో పెడుతుంటే.. మన సినిమా నలిగిపోతుంది. అతను గొడవ పడడానికే మాట్లాడుతూ ఉంటాడు. అసలు అతను చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. ఇక్కడుంటే గొడవలు అయ్యిపోయేవి” అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేసారు.

కాగా రధన్.. అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, హుషారు, జాతిరత్నాలు, పగలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. కానీ తన పద్ధతితోనే మేకర్స్ ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సమయంలో కూడా సందీప్ వంగని ఇలాగే ఇబ్బందిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది.