Tillu Square Twitter Review : ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. డీజే టిల్లు మళ్ళీ హంగామా చేశాడా? ప్రేక్షకులు ఏమంటున్నారు?
'టిల్లు స్క్వేర్' సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
- Saketh U
- Updated on- March 29, 2024 / 07:12 AM IST
Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Twitter Review
Tillu Square Twitter Review : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ‘డీజే టిల్లు'(DJ Tillu) సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో టిల్లు స్క్వేర్ తెరకెక్కింది. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టడంతో సీక్వెల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. సినిమా రిలిజ్ కి ముందు టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే అమెరికాలో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని ఏరియాలలో టిల్లు స్క్వేర్ షోలు పడ్డాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
కొంతమంది నెటిజన్లు టిల్లు స్క్వేర్.. డీజే టిల్లు కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉందని, సిద్ధూ జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అని, సినిమా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది స్క్రీన్ ప్లే బాలేదని, మ్యూజిక్ మరీ ఓవర్ గా ఉందని, కొన్నిచోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదని ఇలా నెగిటివ్ పాయింట్స్ కూడా రాస్తున్నారు.
