Tillu Square : సెప్టెంబర్ నుంచి మరో సినిమా అవుట్.. టిల్లు స్క్వేర్ రిలీజ్ పోస్ట్‌పోన్..
సెప్టెంబర్ లో సినిమా జాతర ఉంది అనుకుంటే.. ఒక్కో సినిమా రేసులో నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్..
- gum 95921
- Published on- September 4, 2023 / 05:59 PM IST
Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square postponed
Tillu Square : ఈ సెప్టెంబర్ లో స్టార్ హీరోల సినిమాలు, క్రేజీ కాంబినేషన్స్ తో దాదాపు పది సినిమాల వరకు రిలీజ్ లు అనౌన్స్ చేయడంతో.. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా జాతర ఉండబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కో సినిమా పోస్ట్‌పోన్ వార్త మూవీ లవర్స్ ని బాధిస్తుంది. ఒక పక్క ‘సలార్’ వాయిదా పడిందని వినిపిస్తుంటే.. తాజాగా టిల్లు స్క్వేర్ ని కూడా వెనక్కి తీసుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. డీజే టిల్లుకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
OG Movie : OG మూవీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. నెట్టింట వైరల్..!
కేవలం అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ని సంపాదించుకున్న ఈ మూవీని.. ఈ నెల 15న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమాని చెప్పిన డేట్ కి తీసుకు రాలేక పోతున్నాము అంటూ నిర్మాతలు ఒక పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. గుడ్ విజువల్స్ అండ్ మంచి వర్క్ తో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకే ఈ టైం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కొత్త డేట్ ని ప్రకటిస్తామంటూ పేర్కొన్నారు.
Pushpa 2 : పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 1000 కోట్లు ఆఫర్ చేశారా..?
కాగా ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కథని అందిస్తుండగా మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ మిర్యాల మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘టికెట్ కొనకుండా’ అనే సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మరి డీజే టిల్లు.. థియేటర్స్ లో తన గోలని ఎప్పుడు షురూ చేస్తాడో వేచి చూడాలి.
