Tillu Square : డీజే టిల్లు సీక్వెల్ రన్ టైం జస్ట్ అంతేనా? సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు ఎందుకు అలా?
టిల్లు స్క్వేర్ రన్ టైం చాలా తక్కువ అని తెలుస్తుంది.
- Saketh U
- Published On : February 23, 2024 / 07:06 PM IST
Siddhu Jonnalagadda DJ Tillu Sequel Tillu Square less Run Time goes Viral
Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా వచ్చిన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సిద్ధూ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. యూత్ లో ఈ సినిమాకి, ఈ సినిమాలో పాటలు, పాత్రలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు.
డీజే టిల్లు(DJ Tillu) సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ రిలీజ్ అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్(Anupama Parameswaran) గా నటిస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 29న రిలీజ్ కానుంది. దీంతో యూత్ టిల్లు స్క్వేర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
టిల్లు స్క్వేర్ రన్ టైం చాలా తక్కువ అని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ రన్ టైం కేవలం 2 గంటల 1 నిమిషం మాత్రమే అని సమాచారం. దీంతో ఫుల్ గా ఎంటర్టైన్ చేసే సినిమాకు ఇంత లెంగ్త్ తక్కువ ఎందుకు, ఇటీవల అన్నీ దాదాపు 3 గంటల సినిమాలు వస్తుంటే ఎందుకు ఈ సినిమాకి తక్కువ లెంగ్త్ అన్ని సందేహాలు వస్తున్నాయి. అయితే డీజే టిల్లు సినిమా కూడా కేవలం 2 గంటల 4 నిమిషాలే.
Also Read : Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్‌కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమాకి సీక్వెల్..
ఎంటర్టైన్ సినిమాకి ఎంత తక్కువ టైం ఉంటే అంత మంచిదని, లేకపోతే సాగదీసినట్టు ఉంటుందని అందుకే టిల్లు స్క్వేర్ సినిమాని రెండు గంటల్లోనే ముగించినట్టు సమాచారం. ఈ స్క్రిప్ట్ ని చాలా సార్లు మార్చినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. సీక్వెల్ అంటే అంచనాలు ఎక్కువ ఉంటాయి, అవి మిస్ అయితే ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందుకే సీక్వెల్ కూడా సక్సెస్ కొట్టాలని సిద్ధూ దగ్గరుండి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని టిల్లు స్క్వేర్ ని రెడీ చేసుకున్నాడు. రెండు గంటల్లో నవ్విస్తూ థ్రిల్ గురిచేసి ప్రేక్షకులని మెప్పించాలని ఫిక్స్ అయ్యాడు. మరి డీజే టిల్లు చేసిన సౌండ్ టిల్లు స్క్వేర్ చేస్తుందా చూడాలి.
