Singer Mangli : మంగ్లీ VS అడ్వకేట్ సుబ్బారావు కేసులో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్ గా మారిన కీలక వ్యాఖ్యలు..!
Singer Mangli : ఇన్ ఫ్రా కంపెనీ వివాదంలో చిక్కుకున్న సింగర్ మంగ్లీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు ఏలాంటి సంబంధ లేదని అప్రూవర్ గా మారిన రామావత్ మధు తెలిపాడు.
- Dharani Pilli
- Updated on- April 15, 2026 / 02:54 PM IST
Singer mangli vs advocate subbarao case ramavath madhu turns approver
- మంగ్లీ వర్సెస్ సుబ్బారావు కేసులో ట్విస్ట్
- అప్రూవర్ గా మారిన రమావత్ మధు
- మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు
Singer Mangli :ప్రముఖ సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో అప్రూవర్ గా మారిన మధు.. కీలక వ్యాఖ్యలు చేశారు. సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హేమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు. కంపెనీలో పెట్టిన సుమారు రూ.20 కోట్లను హేమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరు స్నేహితులని వెల్లడించారు.
అంతేకాక తనకు సుబ్బారావే.. హేమాకాంత్ రెడ్డిని పరిచయం చేశాడని మధు చెప్పుకొచ్చాడు. హేమాకాంత్ రెడ్డి తన డబ్బులు తీసుకున్నాడని.. దీని గురించి తెలుసుకున్న సుబ్బారావు.. తన డబ్బులను తిరిగి ఇప్పిస్తానని చెప్పాడని వెల్లడించాడు. సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని సుబ్బారావు తనని అడిగాడని.. అతడికి బిగ్ బాస్ లోకి వెళ్లాలని చాలా ఆశ అని.. అందుకు అనేక ప్రయత్నాలు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో అసలైన బాధితులు కాకుండా.. వేరేవాళ్లు తెరపైకి వస్తున్నారని మధు ఆరోపించారు.
*సుబ్బారావు డబ్బు డిమాండ్ చేశాడు.. ఎట్టకేలకు నోరు విప్పిన మంగ్లీ
ఇదిలా ఉంటే ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో రామావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరిపై నల్లగొండ, గద్వాల్ లో 62 కేసులు నమోదయ్యాయి. మధు అండ్ గ్యాంగ్ సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో అమాయక జనాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ మొత్తంతో పరారయ్యారు. ఈ గ్యాంగ్ పై నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసును సీఐడీ బృందం పర్యవేక్షిస్తోంది. సీఐడీ పోలీసులు మధు గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మధు అప్రూవర్ గా మారడం ఆసక్తికరంగా మారింది.
సింగర్ మంగ్లీ ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, తన స్నేహితులు మధు, భరత్ చౌహన్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరంతా కలిసి.. గోకుల నందన అనే ఇన్ఫ్రా సంస్థలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 150 మందికి పైగా అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మోసం విలువ సుమారు రూ. 200 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఫిర్యాదులో చెప్పారు. పెట్టుబడుల పేరుతో మంగ్లీ 100 మందిని పైగా మోసం చేయడమే కాక తనను బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు సుబ్బారావు. అయితే అతడి ఆరోపణలను మంగ్లీ కొట్టి పారేశారు.
