Rahul Vaidya
Rahul Vaidya – Disha Parmar: ఈ లాక్ డౌన్ టైంలో సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సెలబ్రిటీలు మాత్రం వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా లిమిటెడ్ అతిథులతో మ్యారేజెస్ చేసుకున్నవారంతా లైఫ్‌లో అతి ముఖ్యమైన ఫంక్షన్ ఇంత సింపుల్‌గా చేసేసుకుంటున్నాం అని బాధపడ్డా.. అందర్నీ పిలిచి తర్వాత రిసెప్షన్ గ్రాండ్‌గా చేసుకుందాం అనుకున్నారు.
కట్ చేస్తే ఇప్పుడో సెలబ్రిటీ కపుల్ వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పాపులర్ సింగర్ రాహుల్ వైద్యా, నోటెడ్ టీవీ యాక్ట్రెస్ దిశా పర్మార్‌ను పెళ్లాడాడు. ముంబైలో రిలేటివ్స్, ఫ్రెండ్స్ మధ్య హిందు సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది.
బిగ్ బాస్-14(హింది) షోలో దిశ, రాహుల్ ఇద్దరు పార్టిసిపెట్ చేశారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ పుట్టింది. కొన్నాళ్లు లవ్ చేసుకున్నాక తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఓ ఇంటివారయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్ దిశ-రాహుల్ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.
Video Credit: @rahulvaidyarkv
rahulvaidya_worldwide