MEGA157 : చిరు బ‌ర్త్‌డే.. మెగా 157 టైటిల్ అనౌన్స్ టైమ్‌ ఫిక్స్‌.. శుక్ర‌వారం ఎప్పుడంటే..?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. MEGA157 వ‌ర్కింగ్ టైటిల్‌తో..

MEGA157 : చిరు బ‌ర్త్‌డే.. మెగా 157 టైటిల్ అనౌన్స్ టైమ్‌ ఫిక్స్‌.. శుక్ర‌వారం ఎప్పుడంటే..?

Mega157 Title Glimpse time fix

Updated On : August 21, 2025 / 12:57 PM IST

MEGA157 : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో 157వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. మెగా 157 వ‌ర్కింగ్ టైటిల్‌తో (MEGA157) రూపుదిద్దుకుంటున్న ఈచిత్రంలో చిరుకు జోడిగా న‌య‌న‌తార న‌టిస్తోంది. గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 2026 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం వెల్ల‌డించింది. ఇక రేపు (ఆగ‌స్టు 22 శుక్ర‌వారం) చిరంజీవి పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. చిరు 70వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది.

Prabhas : భీముడిగా ప్రభాస్?

చిరంజీవి పుట్టిన రోజు కానుక‌గా మెగా 157 టైటిల్‌ను అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమాక్స్‌లో టైటిల్ అనౌన్స్‌మెంట్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఉద‌యం 11.25 గంట‌ల‌కు టైటిల్‌ గ్లింప్స్‌ ను రివీల్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్’ అనే టైటిల్ ని అనుకున్నట్టు తెలుస్తుంది. ఈ టైటిల్‌నే ప్ర‌క‌టిస్తారా? లేదంటే మ‌రో టైటిల్ ను ఉండ‌నుందా తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.