లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్, కుమార్తె సితారలతో ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో మహేష్ చేస్తున్న అల్లరిని ఆయన సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.
తాజాగా మహేష్‌కు కుమార్తె సితార చేసిన హెడ్ మసాజ్ ఫొటోలను నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘ఒక పక్క జీజీ(గౌతమ్ ఘట్టమనేని) గేమ్ ఆడటం చూస్తున్నాం. మరో వైపు మాత్రం మహేష్‌కి హెడ్ మసాజ్ చేయడానికి వాలంటీర్ దొరికింది. రెండు నిమిషాల్లో పని పూర్తి చేసింది’’ అని పోస్ట్ చేశారు నమ్రత. అలాగే సితార కూడా నాన్న తను చేసిన హెడ్ మసాజ్ బావుందని చెప్పడం హ్యపీగా ఉందని చెప్పింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.