Mahaveerudu Twitter Review : శివకార్తికేయన్ ‘మహావీరుడు’ ట్విట్టర్ రివ్యూ.. మహావీరుడు గెలిచాడా?

శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నేడు జులై 14న థియేటర్స్ లోకి వచ్చింది.

Siva Karthikeyan Mahaveerudu Movie Twitter Review and Audience Rating

Mahaveerudu Twitter Review :  శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నేడు జులై 14న థియేటర్స్ లోకి వచ్చింది. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ వాయిస్ ఓవర్ కోసం తెలుగులో రవితేజతో చెప్పించారు. తమిళ్ లో విజయ్ సేతుపతితో చెప్పించారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Baby Twitter Review : ‘బేబీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. అందరి మనసుల్ని కదిలించిన బేబీ..

ఇక ఇప్పటికే తమిళనాడుతో పాటలు తెలుగులో కూడా అనేక చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే సినిమాపై మిక్స్‌డ్ టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అంతా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు.