Sivaji
Sivaji : ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మెప్పించిన శివాజీ మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొన్నాళ్ళు పాలిటిక్స్ లో తిరిగి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో శివాజీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. శివాజీ నటించిన సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని సినిమా మార్చ్ 6న రిలీజ్ కానుంది.(Sivaji)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివాజీ పలు అంశాలపై స్పందించాడు. ఈ క్రమంలో యాంకర్ ఇండస్ట్రీలో వైసీపీకి సపోర్ట్ చేసే నటీనటులకు అవకాశాలు రావట్లేదు ఇది నిజామా కాదా? మీరు టీడీపీ సపోర్ట్ కదా అని అడిగారు.
Also Read : Kiran Abbavaram : వరుస హిట్స్.. కిరణ్ అబ్బవరం రేటు పెంచేసాడా.. ఏకంగా..
దీనికి శివాజీ సమాధానమిస్తూ.. నేను టీడీపీకి సపోర్ట్ కాదు చంద్రబాబునాయుడు గారికి మాత్రమే సపోర్ట్. అలాగే కొంతమందికి జగన్ మోహన్ రెడ్డి ఇష్టం ఉంటుంది. అందులో తప్పు లేదు. జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని సినిమా ఛాన్స్ లు ఇవ్వడం లేదని నిజం కాదు. దానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అవన్నీ అబద్దాలే. పరిశ్రమలో ఎవరి ఇష్టాలు వాళ్లకు ఉంటాయి కానీ ట్యాలెంట్ ని బట్టే అవకాశాలు ఉంటాయి.
కళ్యాణ్ బాబుని ప్రకాష్ రాజ్ ప్రతి క్షణం విమర్శిస్తాడు. కానీ OG సినిమాలో ఇద్దరూ కలిసి పనిచేసారు. ట్యాలెంట్ ఉన్నవాళ్లను పార్టీకి సంబంధం లేకుండా గౌరవిస్తారు. నిర్మాతలకు, దర్శకులకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు ఏ పార్టీ అనేది ఎందుకు తెలుస్తుంది. వాళ్లకు అది అనవసరం. అవన్నీ అబద్దాలు, అవన్నీ నమ్మకండి. ఇక్కడ ట్యాలెంట్ తోనే అవకాశాలు వస్తాయి అని అన్నారు. దీంతో శివాజీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.