Sivakarthikeyan : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి యాక్షన్ లవ్ స్టోరీ అయితే, మరొకటి సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇక తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశాడు. అది కూడా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. మురగదాస్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అతని సినిమాలు కోసం టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తుంటారు.
Bigg Boss 7 : ఈ సారి నామినేషన్ ప్రక్రియ కాస్త కొత్తగా.. మంట తగ్గలే..!
ఇక శివ కార్తికేయన్ కూడా ఇటీవల తన సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది అంటే తెలుగు, తమిళంలో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఈ మూవీని మురగదాస్ ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఈ దర్శకుడు చివరిగా 2020లో రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయింది. మరి మూడేళ్ళ తరువాత వస్తున్న మురగదాస్ ఎలాంటి కథని సిద్ధం చేశాడో చూడాలి.
Kannappa : హీరోయిన్ లేకుండా ‘కన్నప్ప’ షూటింగ్ స్టార్ట్.. మూవీలో మరో సూపర్ స్టార్..!
Thankyou so much Siva! Glad to join with you on the next project! Let’s create some cinematic magic together! 🤗 #SKxARM https://t.co/BvLw6CLjen
— A.R.Murugadoss (@ARMurugadoss) September 25, 2023
శివ కార్తికేయన్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘అయలాన్’ మూవీలో నటిస్తున్నాడు. ఎలియాన్ నేపథ్యంతో సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ.. లవ్ స్టోరీ, దేశభక్తి నేపథ్యంతో ఉండబోతుందని సమాచారం. ఈ రెండు సినిమాలకు అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మరి శివ కార్తికేయన్ ఈ చిత్రాలతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.