Kushi 2 – Pawan Kalyan : ఖుషి 2 స్టోరీని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. SJ సూర్య సంచలన వ్యాఖ్యలు..

తాజాగా SJ సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖుషి 2 కథ పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టు తెలిపాడు.

Kushi 2 – Pawan Kalyan : ఖుషి 2 స్టోరీని రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. SJ సూర్య సంచలన వ్యాఖ్యలు..

SJ Suryah Interesting Comments on Pawan Kalyan and kushi 2

Kushi 2 – Pawan Kalyan : నటుడు, దర్శకుడు SJ సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా వచ్చిన ఖుషి సినిమా అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా, సినిమాలోని సాంగ్స్ ఇప్పటికి ఒక మంచి ఫీల్ ఇస్తాయి. అయితే ఖుషి తర్వాత SJ సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పులి సినిమా చేయగా ఆ సినిమా పరాజయం పాలైంది. తాజాగా SJ సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖుషి 2 కథ పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టు తెలిపాడు.

SJ సూర్య నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని, ప్రియాంక మోహన్, SJ సూర్య కలిసి ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో SJ సూర్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. నేను అది ఖుషి 2 అనుకున్నా ఆయనకు మాత్రం వేరే టైటిల్ చెప్పి కథ చెప్పాను. అది కూడా ఖుషి లాగే పూర్తి లవ్ స్టోరీ. కథ ఆయనకు బాగా నచ్చింది కానీ ఇప్పుడు పూర్తిగా లవ్ స్టోరీలు నాకు వర్కౌట్ అవ్వవు అని అన్నారు. అందుకే ఆ కథ వద్దన్నారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. ఆయన్ని ఒప్పించడానికి నేను చాలా ట్రై చేశాను కానీ ఆయన వద్దన్నారు అని తెలిపారు.

Also Read : Gabbar Singh : పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

దీంతో ఈ విషయం తెలిసి పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఖుషి 2 పవన్ కళ్యాణ్ చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు.