Gabbar Singh : పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
తాజాగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

Pawan Kalyan Gabbar Singh Movie Re Release Trailer Released
Gabbar Singh Re Release Trailer : ఇటీవల పలు హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ కాబోతుంది.
నాగబాబు గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. 12 ఏళ్ళ క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో భారీ హిట్ అయి పవన్ కళ్యాణ్ రేంజ్ ని మరింత పెంచింది. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్, థియేటర్స్ పరంగా పలు రికార్డులు సెట్ చేసింది.
Also Read : Kiran Abbavaram : సొంతూళ్లో మామిడి తోటలో.. కిరణ్ అబ్బవరం రిసెప్షన్ వేడుకలు..
ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమా సందడి చేయనుంది. సెప్టెంబర్ 2న పవన్ అభిమానులు గబ్బర్ సింగ్ సినిమాని థియేటర్లో చూసి రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ చూసేయండి..