SJ Suryah : ఇదేంటి.. నాని సినిమా స్టోరీ మెయిన్ పాయింట్ చెప్పేసిన SJ సూర్య..

తాజాగా SJ సూర్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరిపోదా శనివారం సినిమా మెయిన్ పాయింట్ చెప్పేసారు.

SJ Suryah Revealed Main Plot of Nani Saripodhaa Sanivaaram Movie

SJ Suryah : నాని వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రతి సినిమాతో కొత్త కథలతో, తన పాత్ర పరంగా కూడా వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాని. దసరా, హాయ్ నాన్న సినిమాలతో పూర్తి వేరియేషన్ చూపించిన నాని ఇప్పుడు మరో కొత్త పాత్రలో సరిపోదా శనివారం అంటూ రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా SJ సూర్య నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.

సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా SJ సూర్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సరిపోదా శనివారం సినిమా మెయిన్ పాయింట్ చెప్పేసారు. దీంతో నాని అభిమానులు ఇదేంటి సూర్య ఇలా కథలో మెయిన్ పాయింట్ చెప్పేశాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Balakrishna : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు షురూ..

SJ సూర్య చెప్పిన దాని ప్రకారం సరిపోదా శనివారం కథ.. హీరో చిన్నపట్నుంచి చాలా కోపంగా ఉంటాడు. అయితే హీరో తల్లి ఈ విషయంలో అతన్ని వారించినా మారకపోవడంతో అలా కోపంగా ఉండకూడదు కావాలంటే రోజూ కూల్ గా ఉండి ఆ కోపం అంతా ఒక్క రోజు చూపించుకో అని చెప్పడంతో వారం అంతా చాలా కూల్ గా ఉండి శనివారం పూట తన కోపాన్ని చూపిస్తాడట. అలా తనకి ఎదురైన సమస్యల్లో రోజూ కామ్ గా ఉండి శనివారం ఎలా విజృంభిస్తాడో తెరపై చూడాలి. ఇది విన్న ఫ్యాన్స్, నెటిజన్లు మెయిన్ ప్లాట్ అయితే కొత్తగా ఉంది, సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు