Sobhita Dhulipala: పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ మూవీ.. బర్త్‌డే స్పెషల్ ఫస్ట్‌లుక్ విడుదల
నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) కొత్త మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published on- May 31, 2026 / 09:16 PM IST
Sobhita Dhulipala First Look Released from pa ranjith vettuvam movie
- పెళ్లి తర్వాత శోభిత పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్.
- పా.రంజిత్ ‘వెట్టువం’లో సరికొత్త లుక్.
- సైన్స్ ఫిక్షన్ చిత్రంతో థియేటర్లలోకి.
Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) సినిమాలకు దూరమవుతుందని అంతా భావించారు. కానీ, పెళ్లి తరువాత ఆమె నటించిన ‘చీకటిలో’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. కానీ, ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు థియేటర్లలో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. శోభిత పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఆమె నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Hellallallo Song: హెల్లల్లల్లో సాంగ్ పై తీవ్రమైన ట్రోలింగ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టువం’ అనే హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శోభిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో ఆమె పూర్తి బ్లాక్ డ్రస్‌లో, సరికొత్త పవర్‌ఫుల్ అవతారంలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. హిందీతో కెరీర్ ప్రారంభించి సౌత్ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న శోభిత, ఈ విభిన్నమైన సబ్జెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.
